విజయ్ దేవరకొండ.. ఆ చిన్న లాజిక్ మిస్ అయ్యాడా?

praveen
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ అనే సినిమా ఆగస్టు 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపించిన విజయ్ దేవరకొండ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచేశాడూ. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటివరకూ ఫైట్ సన్నివేశాలకు డాన్సులకు కాస్త దూరంగానే ఉన్న విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో మాత్రం అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలలో కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అంతేకాదు డాన్సులు కూడా ఇరగదీశా అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.


 ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఊహించినదానికంటే అభిమానులు ఎక్కువగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే  వారిని ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నా తాత, తండ్రి  ఎవరో తెలియదు. నా గత సినిమా కూడా పెద్దగా ఆడలేదు. అయినా మీరు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు అంటూ అరుస్తూ చెప్పాడు. అయితే విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండైరెక్ట్గా ఇండస్ట్రీలోని వారసత్వం  మీద అన్నది అర్ధమవుతుంది. ఈ క్రమంలోనే  విజయ్ దేవరకొండ కావాలని ఇలాంటి కామెంట్స్ చేశాడని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.


 అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒక హీరో ఇండస్ట్రీ లో సెటిల్ అయిన తర్వాత అతని ఫ్యామిలీ నుంచి మరికొంత మంది వచ్చి ఇండస్ట్రీ లో సెటిల్ అవడం ప్రస్తుతం అంతటా జరుగుతోంది. ఎవరి దాకా ఎందుకు ప్రస్తుతం విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి హీరోగా రాణిస్తున్నాడు. విజయ్ హీరో కాకపోతే ఆనంద్ తో సినిమా తీయడానికి ఏ నిర్మాత ముందుకు వచ్చే వాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు  అనే స్టాంప్ తోనే వరుస  ప్రాజెక్టులతో ఆనంద్ బిజీగా ఉన్నాడు. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి వారసత్వంపై విజయ్ దేవరకొండ ఇండైరెక్ట్ కామెంట్ చేశాడు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: