అనసూయకు ఈ సినిమా కూడా కలిసిరాలేదా?

Satvika
యాంకర్ అనసూయ ఒకవైపు షోలు చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తూ వస్తుంది..సినిమాలో రోల్ చెయ్యడం తో పాటుగా హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది..ఆ సినిమాలు ఏవి కూడా అనసూయకు కలిసి రాలేదు..అయితే ఇప్పుడు దర్జా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమాలో విలన్ గా అను కనిపించింది..కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ) అంటే బందరులో అందరికీ హడల్. తన మాట వినని పోలీసులను చంపేస్తుంది. తన సాయంతో ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎదురు తిరిగితే ఆయన కుమార్తెను తమ్ముడితో రేప్ చేయించి చంపిస్తుంది.

బందరు నేల మీద తిరుగు లేని కనకం... సముద్రంపై కూడా పట్టు సాధించాలని అనుకుంటుంది. బందరు పోర్టు కాంట్రాక్టు సొంతం చేసుకోవాలని పావులు కదుపుతుంది. ఎదురే లేదనుకున్న కనకానికి ఏసీపీ శివ శంకర్ పైడిపాటి (సునీల్) రూపంలో సుడిగుండం అడ్డు వస్తుంది. మధ్యలో కనకం, ఆమె తమ్ముడు బళ్ళారిని చంపాలని తిరుగుతున్న రంగ ఎవరు? కనకం సామ్రాజ్యంలో అతడి అన్న, మూగవాడు అయినటువంటి గణేష్, తీన్మార్ గీత (అక్సా ఖాన్), పుష్ప పాత్ర ఏమిటి? కనకం అరాచకాలను ఏసీపీ శివ శంకర్ అడ్డుకున్నారా? లేదంటే అతడిని కనకం చంపేసిందా? అనేది సినిమా మొత్తం కథ..
ఈ సినిమాలో అనసూయ పాత్ర మెరుపు తీగలా కనిపిస్తుంది..అనసూయ పాత్రను అడ్డం పెట్టుకుని ప్రేక్షకులతో దర్శకుడు దాగుడుమూతలు ఆడారు. సునీల్ కూడా ఇంటర్వెల్‌కు ముందు ఎంట్రీ ఇచ్చారు. సెకండాఫ్‌లో ఆయన స్క్రీన్ టైమ్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పాలి.

అనసూయ, సునీల్ స్క్రీన్ టైమ్ పక్కన పెట్టి సినిమాకు వస్తే... తెలుగు తెరపై పిప్పి పిప్పి చేసిన కథతో 'దర్జా' తీశారు. సునీల్ ఫ్లాష్‌బ్యాక్‌, బ్రదర్స్ రంగ - సురేష్ స్టోరీ, అనసూయ క్యారెక్టర్ బ్యాక్‌గ్రౌండ్‌ ఏదీ కొత్తగా ఉండదు. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సినిమాలో చూసిన సన్నివేశాలు మళ్ళీ స్క్రీన్ మీద వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది..అనుకున్న కథను డైరెక్టర్ చూపించలేక పోయాడు. మొత్తానికి సినిమా నెగిటివ్ టాక్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: