ఢీ షోలో శ్రద్ధాదాస్ కి భారీ అవమానం.. ఆఖరికి ప్రదీప్ ను కూడా వదలకుండా..?

Anilkumar
మల్లెమాల ఆధ్వర్యంలో నడిచే ఢీ షో, జబర్దస్త్ అలాగే మరికొన్ని షోలకు  గతంలో మంచి రేటింగులు వచ్చేవి.  క్రమక్రమంగా ఆ రేటింగ్లు పడిపోతూ ఉండడంతో ఆయా కార్యక్రమాల నిర్వాహకులు చేయని రాక్షస ప్రయత్నాలు అంటూ ఉండడం లేదు.అయితే  ఆసక్తికరంగా, ఉత్సుకత రేకెత్తించే విధంగా ప్రోమోలు కట్ చేసి ప్రేక్షకులలో ఆసక్తి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలావుంటే ఇప్పటికే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లాంటి కార్యక్రమాలలో ఇలాంటి ప్రయోగాలు చేసి విఫలమవగా ఇప్పుడు కొత్తగా ఢీ షోలో కూడా ఇలాంటి ప్రయోగమే చేసినట్లు కనిపిస్తోంది.అయితే  తాజాగా ప్రసారమవుతున్న ఢీ షో 14వ సీజన్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 

ఇక ఈ ప్రోమోలో ఒక వ్యక్తి హీరోయిన్ శ్రద్ధాదాస్ సహా ప్రదీప్ తో గొడవ పడుతున్నట్లు చూపించారు. ఇకపోతే అతను ఎవరో కాదు సోషల్ మీడియాలో అతను అందరికీ పరిచయమే. ఇక అనేక మందితో ప్రాంక్ లు చేసి ప్రాంక్ స్టార్ కిరణ్ మచ్ఛాగా పేరుపొందిన కిరణ్.ఇప్పుడు ఢీ 14లో బాయ్స్ టీమ్ కి మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు.అయితే  తాజాగా జరిగిన కొరియోగ్రాఫర్ స్పెషల్ రౌండ్లో ఒక పర్ఫామెన్స్ అయిన తర్వాత శ్రద్ధాదాస్ వెళ్లి కంటెస్టెంట్లతో కలిసి డాన్స్ వేయడం కనిపిస్తోంది. ఇక ఆ తరువాత ఈ విషయం మీద ఫైర్ అయిన కిరణ్ ఆమె వెళ్లి వాళ్లతో డాన్స్ చేయడం కరెక్ట్ గా అనిపించడం లేదని వాళ్లతో డాన్స్ చేసింది కాబట్టి వాళ్ల వైపు పక్షపాతంగా వ్యవహరించి వాళ్లకు మంచి మార్కులు ఇస్తే మా పరిస్థితి...


 ఏమిటి అని అడగడం కనిపించింది. ఇకపోతే ఈ విషయంలో ప్రదీప్ మాచిరాజు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా ఆయన మీద కూడా కిరణ్ ఫైర్ అయ్యాడు.ఇక  తరువాత శ్రద్ధాదాస్ కూడా కాస్త ఘాటుగానే సమాధానం ఇస్తూ ఉండడంతో మీరు అంత గట్టిగా మాట్లాడవద్దని ఆమెకు సూచిస్తాడు కిరణ్, ఆమె వెంటనే మీరు కూడా అరుస్తున్నారు కదా అంటే నేనేం చేయాలో మీరు నాకు చెప్పక్కర్లేదు అంటూ ఆమెను అవమానించడం కనిపిస్తోంది.ఇదిలావుంటే తరువాత అతనిని సెట్ నుంచి బయటకు తీసుకు వెళ్ళిపోతున్నట్లుగా ప్రోమో కట్ చేశారు. అయితే  ఇమ ప్రేక్షకులు అయితే ఇదంతా ప్రాంక్ అనే భావిస్తున్నారు. ఇకపోతే గతంలో అనేకమార్లు మల్లెమాల అండ్ టీం ఇలాంటి ప్రాంక్లు చేసి తమకు చిరాకు తెప్పించారని మళ్ళీ మళ్ళీ అదే ప్రయత్నాలు చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

Dhi

సంబంధిత వార్తలు: