టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన బాహుబలి 2 సినిమా పలు దేశాల్లో విడుదల అయ్యి దాదాపుగా 2 వేల కోట్లకు కాస్త అటు ఇటుగా వసూళ్లు రాబట్టింది.ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి మొత్తం 1150 కోట్ల రూపాయల వసూళ్లను దక్కించుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే ఇతర దేశాల్లో ఈ సినిమా ను విడుదల చేయడానికి సాధ్యం కాలేదు. ఇక్కడ విడుదల అయిన సమయంలోనే వివిధ దేశాల్లో కూడా విడుదల చేయడం జరిగింది. తరువాత ఆ వెంటనే నెట్ ఫ్లిక్స్ ద్వారా వందల దేశాల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ను స్ట్రీమింగ్ చేయడం జరిగింది. ఒక వేళ ఓటీటీ స్ట్రీమింగ్ కనుక లేనట్లయితే ఖచ్చితంగా మళ్లీ మళ్లీ ఏదో ఒక దేశం లో ఈ సినిమా విడుదల అవుతూనే ఉండేది. అప్పుడు థియేట్రికల్ స్క్రీనింగ్ ఏడాది పాటు కంటిన్యూస్ గా వస్తూనే ఉండేవి.తద్వారా భారీ గా వసూళ్లు నమోదు అయ్యే ఛాన్స్ కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు ఇంకా అలాగే ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఓటీటీ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ను స్ట్రీమింగ్ చేయకుండా వివిధ దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ చేసి ఉంటే తప్పకుండా ఈ సినిమా రెండు వేల కోట్ల కు పైగా వసూళ్లు ఈ సినిమా నమోదు చేసేది అంటూ ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో ఈమద్య కాలంలో వచ్చిన పలు సినిమా లు కూడా ఓటీటీ లో వెంటనే విడుదల అవ్వడం వల్ల వసూళ్లు అనేవి చాలా తగ్గాయి. కనుక ఈ ఓటీటీ వల్ల వందల కోట్లు నిర్మాతలకు నష్టం వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం ఆర్ ఆర్ ఆర్ సినిమా నిర్మాతలకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా మారింది.ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంటుంది. విదేశీయులు ఈ సినిమాకి పిచ్చ పిచ్చగా ఫిదా అవుతూ ఈ సినిమాలోని క్లిప్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.