మా డాడీ బ్యాడ్ బాయ్ అంటూ రాఖీ బాయ్ తనయుడు వీడియో వైరల్..!!
ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియో విషయానికి వస్తే.. ఇందులో బ్రష్ చేయడం గురించి యశ్ తమ కుమారుడిని మందలించడంతో కాస్త తన కుమారుడు కోపడడం జరిగింది. ఇక దీంతో యశ్ కుమారుడు మధ్వర్ తల్లి రాధికాని గట్టిగా హత్తుకొని.. తన తండ్రి బ్యాడ్ బాయ్ అంటూ చెబుతూ కనిపించడం జరుగుతుంది.. దీంతో యశ్ నాన్న ఇస్ ఏ గుడ్ బాయ్ అనగానే.. నో నాన్న బ్యాడ్ బాయ్ అమ్మ గుడ్ గర్ల్ అని సమాధానాన్ని తెలిపాడు హీరో యశ్ కుమారుడు.
ఇలా తండ్రి కొడుకుల మధ్య జరిగిన చిన్న సంభాషణ వీడియో రాధిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అది కొద్ది నిమిషాలకే చాలా వైరల్ గా మారుతోంది. ఇక ఒక సినిమా షూటింగ్ సమయంలో యశ్ -రాధిక ప్రేమించుకుని 2016లో పెద్దల ఆశీర్వాదంతో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇప్పుడు ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు ఒక కూతురు ఐరా కాగా.. కొడుకు మధ్వర్ కాగ యశ్ వివాహమైన తర్వాత రాధిక పూర్తిగా సినిమాలకు దూరమయింది ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో తన సమయాన్ని గడుపుతోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.