ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న మణిరత్నం ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చియన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష లాంటి హేమాహేమీలు అయిన నటీనటులు నటిస్తున్నారు.
పొన్నియన్ సెల్వన్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండటం, చియన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష లాంటి హేమాహేమీలు అయినా నటీనటులు ఈ మూవీ లో నటిస్తూ ఉండటంతో ఈ మూవీ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మణిరత్నం పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ని తమిళ , తెలుగు , మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నారు.
కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా ఆ టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ లోని ఒక పాటను 300 మంది డాన్సర్లతో 25 రోజుల పాటు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ 300 మంది డాన్సర్ లలో 100 మంది డాన్సర్ లను ప్రత్యేకంగా ముంబై నుండి రప్పించినట్లు సమాచారం. ఈ సాంగ్ ని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.