వరలక్ష్మి శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్... జాగ్రత్తలు తీసుకోవాలని సూచన..!

Pulgam Srinivas
తెలుగు సినీ ప్రేమికులకు వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  తమిళ నాట ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు లో కూడా ఇప్పటికీ అనేక సినిమాల్లో అనేక పాత్రలలో నటించింది.


ఇది ఇలా ఉంటే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడింది. తనకు కారోనా పాజిటివ్ వచ్చింది అని చెబుతూ వరలక్ష్మి ఒక సెల్ఫీ మీ వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. కారోనా ఇంకా ఉంది అని,  జాగ్రత్తలు పాటించాలి అని, మాస్క్ లు కూడా ధరించాలి అని వరలక్ష్మి సూచించింది.  అలాగే తనను కాంటాక్ట్ అయిన వారు కూడా కారోనా టెస్ట్ లు చేయించుకోవాలి అని చెప్పుకొచ్చింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే...  ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ , నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.


గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ మూవీ లో జయమ్మ పాత్రతో ఎంతో మంది ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ మరో సారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో నటిస్తూ ఉండటంతో వరలక్ష్మీ పాత్ర ఈ మూవీ లో ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎంతో మంది సినీ ప్రేమికులు వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు లో సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యశోద సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: