అక్కినేని
నాగచైతన్య మరియు
సమంత జంటగా నటించిన
మజిలీ సినిమాలో సెకండ్
హీరోయిన్ గా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది దిన్యాంశ కౌశిక్. ఆ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులందరూ కూడా ఎంతగానో మంత్రముగ్ధులు అయిపోయారు. దాంతో మంచి ఫాలోయింగ్ తో పాటు క్రేజ్ ను కూడా అందుకుంది. అయితే ఆ
సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన కూడా ఈ
బ్యూటీ కి అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయని చెప్పాలి.
తన కెరియర్ లో ఎంతో ఎత్తుకు ఎదగాలన్న ఉద్దేశంతో ఈమె తొందరపడకుండా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని భావించి ఎన్నో కమర్షియల్ సినిమాలను వదులుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా ఆమె తన రెండవ
సినిమా చేయడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుందని చెప్పాలి. కాస్త ఆలస్యం అయినా సరే ఇప్పుడు ఓ మంచి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతుంది.
రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ
సినిమా ద్వారా మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
ఈ
సినిమా ఎంతవరకు
సక్సెస్ అని అవుతుంది అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు కానీ తన పాత్రకు మాత్రం మంచి పేరును తీసుకువస్థుంది అని ఆమె భావిస్తుంది. ఇక రెగ్యులర్ ప్రమోషన్స్ లో కూడా నటించడానికి ఆమె సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో తన నమ్మకాన్ని ఈ
బ్యూటీ సినిమా నిలబెడుతుందా అనేది చూడాలి. తప్పకుండా రామారావు ఆన్ డ్యూటీ
సినిమా హిట్ అయితే ఈ డ్యూటీకి మరిన్ని
సినిమా అవకాశాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే
తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈమె తెలుగులో కూడా అదే విధంగా బిజీ అవ్వాలని భావిస్తుంది. అలాగే మలయాళ
కన్నడ భాషలలోనూ రెండు చేతులా సినిమాలతో ఈమె కెరియర్ బాగానే ఉంది. మరి తెలుగులో మీడియం రేంజ్ హీరోల సరసన నటించే కథనాయికల జాబితాలో ఈమె కూడా చేరుతుందా అనేది చూడాలి.