నాగచైతన్య హీరోయిన్ కి ఈ సినిమా ఒకటి క్లిక్ అయితే చాలు..!!

Divya
సమంత నాగచైతన్య కలిసి నటించిన చిత్రం మజిలీ. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కీలకమైన పాత్రలో నటించింది దివ్యాంక కౌశిక్. దీంతో ఈమెకు మంచి క్రేజ్ పెరిగిపోయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు పలు అవకాశాలను వచ్చేలా చేసింది. కానీ దివ్యాంక కౌశిక్ తొందర పడకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటోంది. ఈ క్రమంలోని ఈమె కొన్ని కమర్షియల్ సినిమాలను కూడా వదులుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ బాగా వినిపిస్తోంది.

ఏది ఏమైనా కూడా దివ్యాంక కౌశిక్ కాస్త లేటుగా అయినా సరే మంచి సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది అని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆ మధ్య సిద్ధార్థ తో కలిసి నటించిన సినిమా కూడా ఈమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో రవితేజ సరసన రామారావ్ ఆన్ డ్యూటీ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమానే ఈమె అదృష్టాన్ని పరీక్షించబోతోంది. అయితే ఈ చిత్రం ఎంతవరకు సక్సెస్ అవుతుందనే విషయం మాత్రం ఇప్పటికి క్లారిటీ లేదు.

కానీ చిత్ర బంధం మాత్రం ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ ప్రమోషన్లలో పాల్గొంటున్నది హీరోయిన్ దివ్యాంక కౌశిక్. ఈ సినిమా రిజల్ట్ పై ఎంతో నమ్మకంగా ఉన్నట్లుగా తెలుపుతోంది. ఈ హీరోని పోటోలు సోషల్ మీడియాలో  వైరల్ గా మారుతున్నాయి. దీంతో రామారావు ఆన్ డ్యూటీ చిత్రం సక్సెస్ అయ్యిందంటే చాలు ఈమె కెరియర్ మరొక లాగా ఉంటుందని ఆమె అభిమానుల సైతం భావిస్తున్నారు. ప్రస్తుతం ఏ సినిమా అనే కాకుండా తమిళంలో 2 కన్నడలో ఒకటి తెలుగులో ఒక మీడియం  హీరోతో సినిమా చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: