ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి.. ఇక ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచాడు.. అయితే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు కూడా డార్లింగ్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచాయి..ఇక దీంతో ఈయన తర్వాత సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ఇకపోతే పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా ఆదిపురుష్ కావడంతో ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమాలో సీత గా కృతి సనన్ నటిస్తుంది.. ఇదిలావుంటే లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.. లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.ఇకపోతే ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చు చేసినట్టు టాక్.. ఇక ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.. అయితే ఇక ఈ సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ కు డైరెక్టర్ ఓం రౌత్ అదిరిపోయే అప్డేట్ అందించారు..కాగా ఈ సినిమా 3డి ఫార్మాట్ లో సంచలనం సృష్టించడానికి వస్తుంది.. అంతేకాదు 2డి మాత్రమే కాకుండా 3డి వర్షన్ లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
ఇదిలావుంటే తాజాగా ఓం రౌత్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు.. ఇక ఈ సినిమా ఐమాక్స్ 3డి ఫార్మాట్ లో రిలీజ్ కానుందట.. పోతే ఈయన పోస్ట్ చేస్తూ.. నేను ఆదిపురుష్ ఫ్యాన్స్ కోసం ఏదైతే చేయాలనీ అనుకుంటున్నానో అది ఇప్పటికి పూర్తి అయ్యింది.అయితే జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం తాను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నానని తెలిపాడు.. ఇక ఈయన ప్రెసెంట్ లాస్ ఏంజిల్స్ లో ఐమాక్స్ లో 3డి వర్షన్ టెస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ టెస్ట్ ఓకే అవ్వడంతో ఈయన అదే సంతోషంలో ఈ పోస్ట్ చేసాడు.. కాగా దీంతో ఫ్యాన్స్ అంతా ఖుషీగా ఉన్నారు..!!