అల్లు అర్జున్, మహేష్ బాటలో ప్రభాస్..?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రీసెంట్ గా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇకపోతే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా రాధేశ్యామ్ సినిమా ప్రభాస్ అభిమానులను నిరాశ పరిచింది. అయితే ఇక ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ప్రభాస్ నెక్స్ట్ సినిమా సలార్ పైనే ఆశాలు పెట్టుకున్నారు. ఇకపోతే కేవలం తెలుగు దర్శకులే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం డార్లింగ్‏తో మూవీస్ చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.ఇక  ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇక ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాల్సిన స్పిరిట్ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇకపోతే  ఇవే కాకుండా సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నాడు ప్రభాస్.ప్రభాస్ ఆస్థాన నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్టుని నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా అనుష్క శెట్టి కథానాయకగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది..ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పుడు ఓ కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టనున్నడని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే టాలీవుడ్ లో బడా హీరోలు మహేష్ బాబు , అల్లు అర్జున్ , రామ్ చరణ్ పలు బిజినెస్ లలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే.తాజాగా ఇప్పుడు ఇదే బాటలో ప్రభాస్ కూడా ఓ బిజినెస్ ను మొదలు పెట్టనున్నాడట.ఇకపోతే  ప్రభాస్ భోజన ప్రియుడు అన్న విషయం తెలిసిందే.ఇక  దాంతో ఆయన రెస్టారెంట్స్ బిజినెస్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఇక  స్పెయిన్ దుబాయిల్లో హోటళ్లు నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభాస్ టీమ్ రంగంలోకి దిగిందని టాక్ వినిపిస్తోంది.అయితే  మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: