టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబో తున్నాడు. ఆ విధంగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న రెండవ తెలుగు హీరో కావడం విశేషం. ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్ లో తన ప్రతాపం ఏంటో చూపించాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా తన సత్తా చాటువలసిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన లైగర్ సినిమాను విడుదల చేయడం తన అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తుంది.
గత రెండేళ్లుగా ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేక అభిమానులను నిరాశ పరుస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రం తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటుంది అనడంలో ఎలాంటి సం దేహం లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే రాబోయే ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునీ సినిమా పై దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చిత్రబంధం చెబుతుంది.
అయితే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విజయ్ దేవరకొండ పైనే అందరి దృష్టి వెళుతుంది కానీ హీ రోయిన్ నటిస్తున్న అనన్య పాండే కి ఉన్న క్రేజ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియటం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకి ఆమె గురించి పెద్దగా తెలియటం లేదు. బాలీవుడ్ లో ఈమెకు ఉన్న క్రేజ్ అలాంటిది ఇలాంటిది కాదు. భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మను తెలుగులోకి ఎంట్రీ చేయాలనే ఆలోచన రావడం నిజంగా మంచి విషయమనే చెప్పాలి. ఈమె ఈ సినిమా లో ఉండడం బాలీవుడ్ లో విజయ్ దేవరకొండక సినిమా కు మంచి క్రేజ్ వస్తాయని చెప్పాలి ఈ నేపథ్యంలో ఆమె తెలియజేస్తుందో చూడాలి..