టాలీవుడ్ బుల్లితెర షో అయిన జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ షో లో నటించే హైపర్ ఆది గురించి మనందరికి తెలిసిందే. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా తెలిసిందే. ఇదిలావుండగా తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వగా..ఆయన ''పవన్ అంటే ఎందుకు మీకంత ఇష్టం?'' అని విలేకరి ప్రశ్నించాడు. ఇక దానిపై ఆయన స్పందిస్తూ.. ''పవన్‌కల్యాణ్ అంటే నాకు అమితమైన ఇష్టం.అంతేకాదు ఆయన మంచి మనిషి. క్రిష్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ చేస్తోన్న 'హరిహర వీరమల్లు' కోసం నేను చిన్నవర్క్ చేస్తున్నా.
అందులో భాగంగా ఇటీవల ఓ నాలుగు రోజులు ఇంటికి వెళ్లి పర్సనల్‌గా పవన్‌ని కలిశా. ఇక ఆయనెంత గొప్ప మనిషో అప్పుడు మరింత అర్థమైంది.ఇకపోతే ఇప్పుడున్న రోజుల్లో ఎలాంటి వ్యక్తినైనా డబ్బు మార్చేస్తోందనే విషయం మనకు తెలుసు. కాగా ఆయనకు మాత్రం డబ్బు అంటే అస్సలు ఆసక్తి లేదు. అలాంటి వ్యక్తి కచ్చితంగా ఎదుటివారికి మంచి చేయాలనే ఆలోచిస్తాడు.కాగా సినిమాల నుంచి వచ్చిన సొమ్ముని కౌలు రైతులకు సాయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు.అంతేకాకుండా ఒక సినిమా చేస్తే సుమారు రూ.50 కోట్లు వస్తే ఆ మొత్తాన్ని పేదలకు సాయం చేయడానికి, పార్టీ కార్యకలాపాలకు, పార్టీ కోసం పనిచేస్తోన్న వారికి పంచేస్తారు.
ఇక ఆయన వ్యక్తిత్వం అలాంటిది. అందరి మంచి కోరుకునే వ్యక్తికి మంచి జరిగితే మనం ఎంతో సంతోషిస్తాం కదా.అయితే ఆయనపై నా భావన కూడా అదే'' అని ఆది తెలిపారు.ఇకపోతే అనంతరం విలేకరి.. ''వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా'' అని ప్రశ్నించగా.. ''అలాంటిది ఏమీ లేదు'' అని తెలిపారు ఆయన.ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై హైపర్ ఆది చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక హైపర్ ఆది ప్రస్తుతం బుల్లితెరపై తన దైన కామెడీ పంచలతో ఆడియన్స్ ని నవ్విస్తున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే ఇటీవల జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసిన హైపర్ ఆది ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ,ఢీ వంటి షోలలో తనదైన కామెడీతో ఆడియన్స్ నినవ్విస్తున్నాడు..!!