నెటిజెన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాధవి లత...!!

murali krishna
మాధవీ లత ఒకప్పుడు హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలు చేసిన మాధవీలత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన నచ్చావులే మూవీతో హీరోయిన్ గా భారీ విజయాన్ని అయితే అందుకున్నారు.కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో జన్మించిన మాధవీలత తెలుగు, తమిళ భాషలను బాగా మాట్లాడగలరు.


నాని,మాధవీలత కాంబినేషన్ లో స్నేహితుడా సినిమా తెరకెక్కగా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అయితే అందుకోలేదు. స్నేహితుడా తర్వాత మాధవీలత పలు సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ఇటీవల కాంట్రవర్సీస్‌తో ఎక్కువగా ఆమె వార్తలలో నిలుస్తుంది.


మాధవీ లత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అప్పుప్పుడు తన క్యూట్ పిక్స్ను షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్స్ ఒక్కోసారి దారుణమైన కామెంట్స్ కూడా పెడుతుంటారు. తాజాగా ఆమె ట్రెడిషనల్ లుక్‌కి సంబంధించిన పిక్ షేర్ చేయగా, దానికి ఓ నెటిజన్.. ఇలాంటి ఫొటోలు పెట్టి అబ్బాయిలని పడేయడం మీకు కామన్ అయిపోయిందని కదా అంటూ కామెంట్ చేశాడు.


దానికి స్పందించిన మాధవీ లత.. పడిపోతే నాకు నచ్చదు. చచ్చిపోవాలి. అప్పుడు నేను పువ్వులు పంపిస్తాను. అదే నాకు ఇష్టం. పడిపోవడం చాలా ఈజీ. చచ్చిపో నాన్న అంటూ మాధవీలత సదరు నెటిజన్ కి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం మాధవీ లత పోస్ట్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.


ఆ మధ్య మాధవీ లత తన ఫేస్ బుక్ పేజ్ లో ఉన్నట్టుండి నాకు చనిపోవాలని ఉంది అంటూ పోస్ట్ కూడా పెట్టింది. అందుకు కారణం కూడా చెప్పింది. 'నేనెప్పుడూ నా ఫ్రెండ్స్‌తో చెప్తూ ఉంటాను.. ఏదో ఒక రోజు 'ప్రేమ' సినిమాలో రేవతిలా చచ్చిపోతా అని ఫేస్‌బుక్‌లో పేర్కొందట.అందులోలాగే తాను కూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటున్నా అని.. చివరికి ఎలాంటి మెడిసిన్స్ పని చేయవేమో.. అని ఎప్పుడూ ఇదే విషయాన్ని తన ఫ్రెండ్స్‌కి కూడా చెబుతూ ఉంటానని పేర్కొందట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: