ఐకాన్ గా అఖిల్..!

shami
అక్కినేని యువ హీరో అఖిల్ కెరియర్ లో మొదటి హిట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కొట్టాడు. బ్యాచిలర్ హిట్ తో కెరియర్ లో ఫుల్ జోష్ మీద ఉన్న అఖిల్ తన నెక్స్ట్ సినిమా ని ఫుల్ ఫోకస్ తో చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ మూవీతో వస్తున్న అఖిల్ ఆ సినిమా తర్వాత వకీల్ సాబ్ డైరక్టర్ వేణు శ్రీరాం తో ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ కాంబినేషన్ ని దిల్ రాజు సెట్ చేసినట్టు టాక్. దిల్ రాజు దగ్గర అస్థాన డైరక్టర్ అయిన వేణు శ్రీరాం వకీల్ సాబ్ తర్వాత తన నెక్స్ట్ సినిమా అసలైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఐకాన్ మూవీ చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఎందుకో సెట్స్ మీదకు వెళ్లలేదు. అల్లు అర్జున్ ఐకాన్ సినిమా చేయాలన్న ఆలోచనలో లేడట. అందుకే వేణు శ్రీరాం ఆ కథని వేరే హీరో తో చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ఐకాన్ కథను అల్లు అర్జున్ ప్లేస్ లో అఖిల్ తో చేయాలని చూస్తున్నాడు వేణు శ్రీరాం. ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అఖిల్ తో దిల్ రాజు చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఆల్రెడీ నాగ్ తో.. నాగ చైతన్యతో సినిమాలు చేసిన దిల్ రాజు అఖిల్ తో చేస్తున్న ఈ మొదటి సినిమానే క్రేజీగా ప్లాన్ చేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని చెప్పొచ్చు.
అఖిల్ ఏజెంట్ హిట్ పడితే దిల్ రాజుతో చేస్తున్న సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. అఖిల్ తో వేణు శ్రీరాం మూవీ సరికొత్త కాన్సెప్ట్ తో అదిరిపోయేలా ఉంటుందని అంటున్నారు. అఖిల్ ఏజెంట్ తర్వాత అది పర్ఫెక్ట్ సినిమా అవుతుందని చెప్పుకుంటున్నారు. తన సినిమాల లైనప్ తో అక్కినేని ఫ్యాన్స్ ని అలరిస్తున్న అఖిల్ ఏజెంట్, వేణు శ్రీరాం సినిమాలతో కూడా తన హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: