'ది వారియర్' తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అఫీషియల్ తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
రామ్ పోతినేని 'రెడ్' మూవీ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తర్వాత ది వారియర్ అనే మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండగా, ఆది పినిశెట్టి ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
 

కృతి శెట్టి ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ లో రామ్ పోతినేని కెరియర్ లో మొట్ట మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ది వారియర్ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లు, టీజర్ , ట్రైలర్ లలో రామ్ పోతినేని అదిరిపోయే పవర్ ఫుల్ పోలీస్ లుక్ లో అదరగొట్టాడు. తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను జూలై 14 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం తమిళ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది.

ఈ మూవీ తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చారు. ఇది ఇలా ఉంటే తాజాగా ది వారియర్ తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన సమయాన్ని మరియు వేదిక ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ది వారియర్ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూలై 10 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జే ఆర్ సి కన్వెన్షన్ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా ది వారియర్ చిత్ర బృందం ప్రమోషనల్ స్పీడ్ ను వేగవంతం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: