
స్టార్ హీరో విక్రమ్ కు గుండెపోటు... లేటెస్ట్ అప్డేట్ ఇదే?
ఇదిలా ఉంటే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం విక్రమ్ కు గుండె పోటు వచ్చినట్లు తెలుస్తోంది. దానితో తన కుటుంబ సభ్యులు విక్రమ్ ను వెంటనే దగ్గర్లోని కావేరి హాస్పిటల్ కు తరలించారు. అయితే విక్రమ్ ఇప్పుడు ఐసియు లో చికిత్స తీసుకుంటున్నాడట. ఈ మధ్యనే విక్రమ్ కు 56 సంవత్సరాలు వచ్చాయి. ప్రస్తుతం ఇతడి హెల్త్ బులెటిన్ కోసం ఫ్యాన్స్ మరియు ఫామిలీ మెంబర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వయసు మీద పడుతున్నా ఇంకా సినిమాలు చేస్తున్నాడు విక్రమ్.
ప్రస్తుతం విక్రమ్ మణిరత్నం చేస్తున్న పాన్ ఇండియా మూవీ లో లీడ్ రోల్ లో చేస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లను వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో విక్రమ్ కు జోడీగా మాజీ ప్రపంచ సుందరికి ఐశ్వర్యారాయ్ నటింస్తుండడం గమనార్హం. కాగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు చెన్నైలో పొన్నియిన్ సెల్వన్ సినిమా టీజర్ ను లాంచ్ చేయడానికి పూనుకున్నారు. ఇంతలోనే ఇలా జరగడం తో చిత్ర బృందం కూడా నిరాశలో ఉన్నారు.