టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు టాలీవుడ్ హాట్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అయితే తాజాగా ఈ జంట నటిస్తున్న తాజా చిత్రం ఖుషి అన్న సంగతి తెలిసిందే.ఇకపోతే ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు.అయితే ఈ మూవీ కొత్త షెడ్యూల్ వైజాగ్‌లో మొదలవబోతుంది.ఇక ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం , యశోద సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటున్నాయి.ఇకపోతే యశోద సినిమా రిలీజ్ కూడా త్వరలోనే ఉండబోతుంది. ఇక ఇలా సినిమా తర్వాత సినిమాను కంప్లీట్ చేస్తున్న సమంత..వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను కమిటవుతోంది.
ఇదిలావుంటే ఇటీవలే తాప్సీ నిర్మాణంలో సమంత నటించినబోతుందని క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా త్వరలో ప్రకటించనున్నారు. కాగా విజయ్ దేవరకొండ ఇప్పటికే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాను కంప్లీట్ చేశాడు. అయితే ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా, మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.ఇకపోతే ఆగస్టు 25న లైగర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కాబోతుంది.అంతేకాక పూరి - విజయ్ కాంబినేషన్లోనే జనగణమన కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. అయితే వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ఇక ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. కాగా ఇదే క్రమంలో మరోవైపు ఖుషి సినిమాను చక చకా కంప్లీట్ చేస్తున్నాడు విజయ్.అయితే ఇప్పటికే, మొదటి షెడ్యూల్ కశ్మీర్లో జరుపుకుంది. కాగా మేజర్ టాకీ పార్ట్ అక్కడ పూర్తి కాగా, త్వరలో తాజా షెడ్యూల్ వైజాగ్‌లో మొదలవబోతుంది. ఇకపోతే ఈ షెడ్యూల్లో సమంత, విజయ్ దేవరకొండలపై ఓ రొమాంటిక్ సాంగ్‌తో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇక ఈ షెడ్యూల్‌తో ఖుషి సినిమాకు సంబంధించిన దాదాపు చిత్రీకరణ కంప్లీట్ అవుతుందట. కాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.విజయ్ మరియు సామ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం వీరి అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు...!!