ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా బన్నీ హవానే నడుస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా బన్నీ పేరే వినిపిస్తోంది ... స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమాపై దృష్టి పెట్టారు. అయితే తాజాగా పుష్ప1 సినిమాతో బాలీవుడ్ లో క్రేజ్ ను పెంచుకున్న ఈ స్టార్ హీరో పుష్ప2 సినిమాతో తన మార్కెట్ మరింత పెరగడం గ్యారంటీ అని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఇకపోతే బన్నీవాస్ తాజాగా బన్నీ లైనప్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కాగా ఇప్పుడు పుష్ప2 సినిమాతో బన్నీ బిజీగా ఉన్నప్పటికీ కొత్త కథలు వింటున్నాడని తెలుస్తోంది.అయితే ఎక్కడో ఒక పాత్రను పట్టుకుని బన్నీ కథను లాక్ చేయడం జరుగుతుందని బన్నీవాస్ తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం బన్నీ మూడు కథలు వింటున్నారని తర్వాత మూవీ ఏదనే ప్రశ్నకు బన్నీ దగ్గరే సమాధానం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.ఇక పుష్ప తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయాలని పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అయిందని బన్నీవాస్ కామెంట్లు చేశారు. పోతే త్రివిక్రమ్ డైరెక్షన్ లో కూడా బన్నీ నటించాల్సి ఉందని ఆయన అన్నారు.ఇదిలావుంటే మహేష్ బాబు సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఏం జరుగుతుందో చూడాలని బన్నీవాస్ చెప్పారు.
ఇక బన్నీతో సినిమా తీసే అవకాశం గీతాఆర్ట్స్2 బ్యానర్ కు వస్తే ఆ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ కు అప్పగిస్తానని బన్నీ తెలిపారు.అయితే పెద్ద సినిమాలు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తీయడానికి ఒక కారణం ఉందని ఆయన తెలిపారు.ఇకపోతే చిరంజీవి, బన్నీ, చరణ్ సినిమాలు గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే తీయాలని అల్లు రామలింగయ్య గారికి సమర్పకులుగా ఆ గౌరవం ఇవ్వాలని అనుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.అంతేకాక గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో 2019లో సెట్స్ పైకి వెళ్లిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయని బన్నీ వాస్ అన్నారు.అయితే ఇప్పుడు సెట్స్ పై ఉన్న సినిమాలన్నీ అప్ డేటెడ్ కంటెంట్ తో ఉంటాయని బన్నీవాస్ తెలిపారు...!!