వివాదంలో మరో సినిమా.. బ్యాన్ చెయ్యాలని డిమాండ్..

Satvika
ఈ మధ్య వస్తున్న సినిమాలు అన్నీ కూడా వివాదాలకు కెరాఫ్ గా మారుతున్న సంగతి తెలిసిందే..కంటెంట్ కొత్త ధనం అంటూ ఏదేదో చూపిస్తున్నారు.మాములుగా కంటెంట్ అయితే పర్వాలేదు కానీ ఏకంగా దేవుడు మీద తప్పుడు సినిమాలు చెయ్యడం పై కొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా మరో సినిమా వివాదంలోకి వెళ్ళింది.కాళి పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిల్మ్ పై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
భారతీయ చిత్రనిర్మాత లీనా మణిమెకలై దర్శకత్వం వహించిన ఒక డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్ వివాదంగా మారింది. ముఖ్యంగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ ఆ వివాదం దేనికంటే..కాళి పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిల్మ్ లో 'కాళికామాత సిగరెట్ తాగుతున్నట్టు'గా పోస్టర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ లీనా మణిమెకలై.

కాళికామాత సిగరెట్ తాగడం, మరోచేతిలో ఎల్జీబీటీలకు సంబంధించిన జెండాను పట్టుకోవడం రెండూ వివాదం అవుతున్నాయి..హిందూ దేవతను ఇంత దారుణంగా కించపరుస్తారా? అంటూ హిందూ సంఘాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. హిందువుల మనోభావాలు గాయపర్చిన లీనాను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లీనాపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. దీంతో ఈ పోస్టర్ పై దర్శకుడు వివరణం ఇచ్చారు. సమానహక్కుల కోసం ఈ డాక్యుమెంటరీని తీసినట్టు లీనా తెలిపారు.

కెనడా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అయితే కాళీమాతా సిగరెట్‌ తాగుతున్నట్టు విడుదల చేసిన ఫోటోపై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు డైరెక్టర్‌ లీనా. వాక్‌స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్దంగా ఉన్నానంటూ బదులిచ్చారు. డైరెక్టర్‌ లీనాపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లీనాను అరెస్ట్ చేయాలంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు...లీనా విడుదల చేసిన ఫోటోలో కాళీ మాత సిగరెట్‌ తాగుతున్నట్టు ఉంది. చేతిలో త్రిశూలంతో పాటు గొడ్డలి కూడా ఉంది.. మొత్తానికి ఈ సినిమా దుమారం రేపుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: