తెలుగు సినీ ఇండస్ట్రీలో 'ఉప్పెన' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు తొలిసారి పరిచయమైన కన్నడ భామ కృతిశెట్టి .ఇకపోతే ఈమె తొలి చిత్రంతోనే కథానాయికగా సంచలనం సృష్టించింది ఈ బ్యూటీ.ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయేంది కృతి.తన ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం అమ్మడి ఆభరణాలు.అంతేకాదు ఈ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ తో కృతిశెట్టి వరుసగా అవకాశాలు కైవసం చేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమె నటించిన 'బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్' చిత్రాలు సైతం సూపర్ హిట్ అవడంతో హ్యాట్రిక్ హిట్ సాధించిన కొత్త కథానాయికగా ప్రత్యేకంగా నిలిచింది.
ఇదిలా ఉంటె ప్రస్తుతం కృతి తెలుగులో 'ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి , మాచర్ల నియోజకవర్గం' లాంటి సినిమాలతో పాటు రామ్ పోతినేని హీరోగా, లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న పోలీస్ యాక్షన్ చిత్రం 'ది వారియర్' లోనూ నటిస్తోంది కృతి శెట్టి. అయితే తెలుగు తమిళ బైలింగ్విల్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది.ఇక ఇదిలా ఉంటే.. కృతి శెట్టికి కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు వరిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు బాల దర్శకత్వంతో సూర్య హీరోగా నటించే ఆయన 41వ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది.ఇకపోతే ఆ తర్వాత యోగిబాబు హీరోగా ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందిన 'మండేలా' ఫేం అశ్విన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటించే చిత్రంలోనూ కృతిశెట్టి అవకాశం దక్కించుకుంది.
అయితే,ఇక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.అయితే ఎందుకంటే శివకార్తికేయన్ కమిట్ అయిన రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాతే సెట్స్‌పైకి వెళ్ళనుంది.ఇకపోతే కామెడీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కృతిశెట్టి వైవిధ్యమైన పాత్ర పోషించబోతున్నట్టు టాక్.అయితే కేవలం గ్లామర్ కే ప్రధాన్యతనివ్వకుండా.. ఇక అభినయం పరంగానే ఆమె పాత్ర ప్రత్యేకం కాబోతోంది.అయితే మరి శివకార్తికేయన్ జోడీగా కృతిశెట్టి ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి...!!