పక్కా కమర్షియల్ సినిమా మొదటిరోజు ఎన్ని కోట్లు.. రాబట్టిందంటే..!!
దీంతో ఈ సినిమా బాగానే దూసుకుపోతోంది. గోపీచంద్ యాక్షన్ సన్నివేశాలకు రాశీ ఖన్నా అందం, అభినయం మారుతి స్టైల్ కామెడీకి ఈ సినిమాకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో సినిమా టాక్ తగ్గట్టుగానే మొదటి రోజు పక్కా కమర్షియల్ సినిమాకి భారీగానే వసూలు చేసినట్లుగా తెలుస్తోంది మొదటి రోజు దాదాపుగా రూ.6.3 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లుగా చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. దీంతోపాటు గోపీచంద్ కెరీర్ లోని ఈ సినిమా హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించారు.
ఈవారం కూడా పెద్ద సినిమాలు బరిలో లేకపోవడంతో వీకెండ్ కలెక్షన్లు కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా ట్రెండ్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అంతే కాకుండా కోర్టు సన్నివేశాలు ఈ సినిమాలో త్యాగరాజ్ రావు రమేష్ సప్తగిరి వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ అతిథి పాత్రలో నటించి అందరిని మైమరిపించింది. మరి ఈ సినిమాతో గోపీచంద్ సక్సెస్ అయ్యాడా లేదా అనే విషయం తెలియాలి అంటే మరొక కొద్ది రోజులు ఆగాల్సిందే. మరి గోపీచంద్ తన తదుపరి చిత్రం పైన ఫోకస్ పెడతారేమో చూడాలి.