
ఆ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న నాని.. నిర్మాతలకు పండగే..!!
ఇక ఇదిలా ఉండగా మరికొంతమంది హీరోలు కూడా సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతున్నారని వార్తలు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోని నాచురల్ స్టార్ నాని కూడా ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా నాని దసరా సినిమా కోసం రెమ్యునరేషన్ ను బాగా తగ్గించుకున్నాడు అనే వార్త బాగా వినిపిస్తోంది. నిజానికి తాను ఒక సినిమాకు తీసుకునే మొత్తంలో సగానికి సగం తగ్గించుకున్నట్లుగా సమాచారం. అంతేకాదు ఆ సగం పారితోషకాన్ని కూడా సినిమా పైనే ఖర్చు పెట్టాల్సిందిగా చిత్రం నిర్మాతలకు తెలిపారట నాని..
ఒకవేళ సినిమా విడుదల అయ్యి మంచి లాభాలు వస్తే మిగిలిన డబ్బులను మాత్రమే తనకు ఇస్తే సరిపోతుందని కోరాడట. ఇక ఈ విషయాన్ని స్వయంగా దసరా సినిమా నిర్మాత సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం గమనార్హం.. ఇక ఈ విషయం తెలుసుకున్న నిర్మాతలు కూడా నానిని ప్రశంసలతో ముంచడమే కాకుండా నాని తీసుకున్న నిర్ణయానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త పుంతలు నడుస్తున్నట్లే అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదే నిజమైతే నాని బాటలోనే మరికొంతమంది హీరోలు నడిచే అవకాశం కూడా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నాని లాగే మరికొంతమంది హీరోలు కూడా ఆలోచిస్తే నిర్మాతలకు ఇబ్బందులు ఉండవు అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు..