యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా రాబోతున్న చిత్రం థాంక్యు. రాషీ కన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అవికా గోర్ మరియు మాళవి క నాయర్ కూడా ఇతర హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్డేట్స్ మంచి రెస్పాన్స్ అందుకుంటూ సినిమాపై అంచనాలను ఏర్పరచుకుంటుంది.
ఆ మధ్య రెండు పాటలను విడుదల చేసిన ఈ చిత్ర బృందం తాజాగా మరో పాటను కూడా విడుదల చేసి సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తమన్ సంగీతం సమకూర్చగా ఈ సినిమాలో నీ ఫేర్ వెల్ సాంగ్ కు మంచి వ్యూస్ ను ఇస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజ్ విషయంలో అంచనాల విషయంలో అన్ని బాగానే ఉన్నా కూడా విడుదల విషయంలో స్పష్టత రాకపోవడం అభిమానులను ఎంతగానో అయోమయానికి గురిచేస్తుంది.
ముందుగా జూలై 8వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల భావించక జూలై 22వ తేదీకి ఈ సినిమాను మార్చడం అభిమానులకు కొంత నిరాశ కలిగించింది ఇక విడుదల తేది దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో సన్నాహాలు చేస్తున్నారు బి.వి.ఎస్.రవి ఈ చిత్రానికి కథ అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో దూత అనే మరొక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇది అమెజాన్ లో విడుదల కాబోతున్న వెబ్ సిరీస్ కావడం విశేషం. చైతు ఇటీవలే వెంకట్ ప్రభు దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కృతి శెట్టి ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.