మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేస్తున్న తెలిసిందే. ఇప్పటి వరకయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు సినిమా వర్గాలు చెప్పే దాని ప్రకారం ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. పక్కా కమర్షియల్ సినిమాను ఈ శుక్రవారం విడుదల చేస్తున్న మారుతి ఆ తర్వాత ప్రభాస్ సినిమా పనులను మొదలు పెడుతున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తిచేసి ఆ తర్వాత ప్రభాస్ తో షూటింగ్ కు వెళ్లబోతున్నాడు.
ఆ విధంగా ప్రభాస్ కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాలు త్వర త్వరగా పూర్తి చేసి మారుతి తో చేయబోయే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అభిమానులు కూడా వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో అన్న ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరిగా అనుష్కను ఎంపిక చేయాలన్నది ప్రభాస్ అభిమానుల కోరిక.
వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. బాహుబలి సినిమా తర్వాత అనుష్క సినిమాలలో నటించింది లేదు. ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ సినిమాలలో బిజీ కావాలని ఆమె అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఆ తర్వాత కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించిన కూడా అనుష్క ఆ సినిమాలతో తన కెరీర్ను కంటిన్యూ చేయలేక పోయింది. దాంతో ఇప్పుడు ఆమె తిరిగి సినిమాలలో రీఎంట్రీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా అనుష్కను తీసుకోవాలని ప్రభాస్ అభిమానులు మారుతీకి సూచిస్తున్నారు. మరి ఇది జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఆమెనే ఎక్కువగా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర హీరోయిన్ ల ప్లేస్ లో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.