నా వయసు అంత కాదు గూగుల్ ని నమ్మొద్దు మెగా హీరో..!!

Divya
టాలీవుడ్ మెగాహీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పెన చిత్రంతో అందరి దృష్టిని బాగా ఆకట్టుకున్నాడు ఈ యువ హీరో. మొదట చిత్రంతోని 100 కోట్లను సాధించిన క్రెడిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత కొండపొలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అంతగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఇదంతా ఇలా ఉండగా వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం రంగ రంగ వైభవంగా. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో వైష్ణవి తేజ్ సరసన హీరోయిన్ కేతికశర్మ నటిస్తున్నది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా బిజీగా ఉన్నారు. ఈ చిత్రం జూలై ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరిని ఆకట్టుకునేలా ఉంటుందని ఈ సినిమా టీజర్ ని చూస్తే మనకి తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరైన వైష్ణోవ్ తేజ్ తాజాగా యూట్యూబర్ గలాటా  గీత ప్రశంసలు కురిపించింది. అంతే కాకుండా డైరెక్ట్ గా అతని ఏజ్ గురించి అడిగేసింది.
వైష్ణవి తేజ్ ఏ మాత్రం ఆలోచించకుండా టక్కున సమాధానం అని తెలియజేశారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఇంత లేటుగా సినిమాల్లోకి ఎందుకు వచ్చారు ముందే రావాల్సిందిగా అని  గితు అడగడంతో .. నేను ఇండస్ట్రీలోకి కరెక్ట్ ఏజ్ లోనే వచ్చాను ఇంతకంటే తక్కువ రోజులే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే చిన్నపిల్లాడు ఉంటారని తెలిపారు. అయితే హీరో అనుకోవాలని అనుకోలేదు ఏదో సోషల్ మీడియా ఫోటో షేర్ చేశాక అది డైరెక్టర్ చూడడం జరిగింది అలా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాను అని తెలిపారు. ఎందుకు అలా ఏజ్ గురించి అడిగారని ప్రశ్న వైష్ణవ్ తేజ్ అడగగా.. ఇప్పుడు గూగుల్ లో మీ ఏజ్ గురించి చాలా చర్చ జరుగుతోంది అని తెలిపింది. ప్రస్తుతం నీ ఏజ్ 32 డే లను చూపిస్తోంది అది నిజమేనా అని అడిగాను.. అయితే ఈ విషయంలో మాత్రం గూగుల్ అసలు నమ్మవద్దు నా ఏజ్ అంత లేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: