నాగచైతన్య 'థాంక్యూ' మూవీ విడుదల వాయిదా పడనుందా..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుండగా,  ఈ సినిమాకు సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని సమకూర్చాడు .

ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , శిరీష్ నిర్మించారు. ఈ మూవీ ని కొంత కాలం క్రితమే జూలై 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే...  ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు,  అందుకు ప్రధాన కారణం...  ఈ సినిమా విడుదలకు తక్కువ కాలం ఉండడంతో , ఇంకా ప్రచారాలను కూడా మొదలు పెట్టకపోవడంతో కాస్త సమయం తీసుకొని సినిమా ప్రమోషన్ లను భారీ ఎత్తున నిర్వహించే అప్పుడు సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్టు ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది .

అలాగే ఈ సినిమా జూలై 22 వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ వార్తలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు,  పాటలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: