సూర్య కూతురు టెన్త్ మార్క్స్ చూస్తే షాకవ్వాల్సిందే!

Purushottham Vinay
తమిళ స్టార్ నటుడు సూర్య టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తమిళంలోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. తన దైన స్టైల్లో సూర్య సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న సూర్య… ఇప్పుడు కోలివుడ్‌లో నెంబర్ వన్ స్టార్‌ హీరోగా ఎదిగాడు.ఇటు టాలీవుడ్‌లో కూడా సూర్యకు చాలా మంది అభిమానులు ఉన్నారు.ఇక సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2006 వ సంవత్సరంలో ఈ ఇద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు.ఇప్పుడు ఈ దంపతులకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. ఒక కూతురు ఇంకా ఒక కుమారుడు ఉన్నారు. కూతురు పేరు దియా ఇంకా కొడుకు పేరు దేవ్‌.హీరోయిన్‌గా కెరీర్ బాగా పీక్స్‌లో ఉన్నప్పుడే సూర్యను పెళ్లి చేసుకుని జ్యోతిక సినిమాలకు గుడ్ బై చెప్పి తమ పిల్లలు దియా ఇంకా అలాగే దేవ్ ఆలనా, పాలనా చూసుకుంటుంది.ఇక సూర్య కూడా ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడపడానికి బాగా ఇష్టపడుతుంటారు. అలాగే సూర్య కూతురు దియా చెన్నైలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 10వ తరగతిని పూర్తి చేసింది. ఇక ఆమె టెన్త్ పరీక్ష ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. చిన్నప్పటి నుంచి కూడా ఆమె ఫస్ట్ క్లాస్ స్టూడెంట్.ఇక 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో దియా మార్కులు చూసిన వారందరూ కూడా దెబ్బకు షాక్ అవుతున్నారు.


ఎందుకంటే దియా అన్ని సబ్జెక్టుల్లో కూడా చాలా మంచి మార్కులు సంపాదించింది. ఇక మ్యాథమెటిక్స్ లో అయితే ఆమె 100కు 100 మార్కులు రావడంతో ఇది చూసిన వారందరూ కూడా దెబ్బకు షాక్ అవుతున్నారు. అన్ని సబ్జెక్టుల్లో కూడా ఆమెకు 95 ప్లస్ మార్కులు సంపాదించింది దియా. ఇంగ్లీషులో 99, సైన్స్‌లో 98, తమిళ్‌95 ఇంకా అలాగే సోషల్ 95 మార్కులు వచ్చాయి.అలాగే కష్టంగా ఉండే మ్యాథమేటిక్స్‌లో కూడా 100 శాతం మార్కులు సంపాదించిందంటే దియా ఎంత కష్టపడి చదివిందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.ఇక తన కూతురు సాధించిన బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్‌కు సూర్య అయితే బాగా పొంగిపోతున్నారు. అలాగే వారి కుటుంబం మొత్తం కూడా బాగా సంబరాలు చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం సూర్య దంపతులకు ఇంకా అలాగే దియాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సూర్య తమ పిల్లలని సినిమాలలోకి తీసుకొస్తారా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: