తాజాగా మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'.ఈ సినిమా అనంతరం రవితేజ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.పోతే ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న.రవితేజ హీరోగా మరియు ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీం వర్క్స్ పతాకాలపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ఇదిలావుండగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఈ సినిమ నుండిఆల్రెడీ విడుదలైన 'బుల్ బుల్ తరంగ్', 'సొట్టల బుగ్గల్లో...' పాటలు యూట్యూబ్లో మిలియన్స్ వ్యూస్ అందుకోవడం మనం చూసాం.
ఇకపోతే యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అంతేకాకుండా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఇసుక మాఫియాతో పాటు సమాజంలో అవినీతిపై పోరాటం చేసే ప్రభుత్వ అధికారిగా రవితేజ కనిపించనున్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే అందరూ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా జూలై 29న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.ఇకపోతే తొలుత మార్చి 25న 'రామారావు ఆన్ డ్యూటీ'ని విడుదల చేయాలని అనుకున్నారు.ఇకపోతే ఆ సమయం లో 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' రావడంతో వాయిదా వేశారు.
అయితే ఆ తర్వాత జూన్ 17న విడుదల చేయాలనుకున్నా... కొన్ని సాంకేతిక కారణాల కారణంగా వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు జూలై 29న విడుదల చేయాలని ముహూర్తం ఖరారు చేశారు చిత్రం బృందం.ఇక ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.స్టువర్టుపురం దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది...!!