కోలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోలలో ఒకరు అయినా కార్తీ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కొనసాగుతున్న కార్తీ తాను తమిళంలో నటించిన అనేక సినిమా లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు .
ఇది ఇలా ఉంటే కార్తి ఆఖరుగా సుల్తాన్ మూవీ లో హీరోగా నటించాడు . ఈ మూవీ లో కార్తీ సరసన రష్మీక మందన కథానాయికగా నటించింది . ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ బాక్సాపీస్ దగ్గర పర్వాలేదు అనే రిజల్ట్ ను తెచ్చుకుంది . అలా సుల్తాన్ మూవీ తో ప్రేక్షకులను అలరించిన కార్తీ ప్రస్తుతం సర్దార్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కి పీయస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాత లక్ష్మణ్ కుమార్ ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో సర్దార్ మూవీ ని నిర్మిస్తున్నాడు .
ఇ
ప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది. కొంత కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ ను విదేశాల్లో తెరకెక్కించారు. అందులో భాగంగా విలన్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా రూ.4 కోట్ల తో ఒక భారీ సెట్ ని నిర్మించారు. ఈ మూవీ లో కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉండగా ఈ సినిమాలో కార్తీ సరసన రాశి కన్నా కథానాయికగా కనిపించబోతోంది.