టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న రాజమౌళి అంటే ఒక బ్రాండ్ అనే చెప్పాలి. ఆయన ఒక గొప్ప టెక్నీషియన్ అని మాత్రమే కాకుండా మంచి జడ్జ్‌మెంట్ ఉన్న వ్యక్తి అంటూ ప్రతి ఒక్కరి వద్ద కూడా మంచి పేరును దక్కించుకున్నాడు.అందుకే ఇక యస్ యస్ రాజమౌళి ఏదైనా సినిమా గురించి మాట్లాడితే.. ఆ సినిమా బాగుంది అంటే ఖచ్చితంగా అది ఒక బ్లాక్ బస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే రాజమౌళి నోటి నుండి తమ సినిమా పేరు రావాలని కోరుకునే వారు చాలా మంది కూడా ఉంటారు.ఇక యస్ యస్ రాజమౌళి ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా ను ప్రమోట్ చేసే బాధ్యత తన నెత్తిన వేసుకున్నాడు.ఇక ఈ భారీ బడ్జెట్ బ్రహ్మాస్త్ర తెలుగు వర్షన్ ను రాజమౌళి సమర్పించేందుకు ముందుకు వచ్చాడు. ఏడాది క్రితమే ఈ విషయంలో క్లారిటీ కూడా వచ్చింది.ఇక దర్శకధీరుడు రాజమౌళికి భారీ మొత్తం లో ఆఫర్ చేశారో లేదంటే ఆయన కు ఈ సినిమా కథ నచ్చిందో లేదా మరేదైనా కారణం ఉందో లేదో తెలియదు కాని ఆయన బ్రహ్మాస్త్ర సినిమా తెలుగు వర్షన్ ను హైప్ చేసే పనిని తీసుకున్నాడు.
యస్ యస్ రాజమౌళి ప్రజెంట్స్ అనగానే బ్రహ్మాస్త్ర స్థాయి ఇంకా స్టామినా తెలుగు రాష్ట్రాల్లో అమాంతం పెరిగింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ ఈ సినిమా గురించి అంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సమయంలో విడుదల అయిన బ్రహ్మాస్త్ర సినిమా ట్రైలర్ ప్రతి ఒక్కరికికూడా షాక్ కు గురి చేసింది. అసలు ఇది ఒక ట్రైలరా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.బ్రహ్మాస్త్ర లో అద్బుతమైన గ్రాఫిక్స్ ఉంటాయి అంటూ యూనిట్ సభ్యులు మొదటి నుండి కూడా చెబుతున్నారు. తీరా చూస్తే అవేమో చిన్న పిల్లలు చూసే గ్రాఫిక్స్ మాదిరిగా ఉన్నాయి. ఇక వీఎఫ్‌ఎక్స్ నేర్చుకుంటున్న పిల్లలు ఇంతకు మించి మంచి వర్క్ ను అందిస్తారు అనేది చాలా మంది అభిప్రాయం.సినిమా ట్రైలర్ ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అంటూ ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి తన పరువు తీసుకోకుండా ఈ సినిమా ను వదిలేసి తన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ పనులు చూసుకోవాల్సిందిగా అభిమానులు ఆయనకు సలహా ఇస్తున్నారు.