అందుకే పెద్ద హీరోలు సాయి పల్లవి తో నటించడం లేదా..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి , ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్ద హీరో కి ఉన్న క్రేజ్ ఆమె సొంతం. తెలుగు లో సినిమా చేయకముందే ఆమెకు ఇక్కడ మంచి గుర్తింపు వచ్చింది. అభిమానులు ఏర్పడ్డారు. ఈనేపథ్యంలో ఆమె తెలు గు లో సినిమా చేయాలనే డిమాండ్ ఎరపడగా ఫిదా సినిమా లో ఆమె నటించి ప్రేక్షకులను ఎంతో అలరించింది. అప్పటినుంచి సాయి పల్లవి కి ఎదురులేకుండా పోయింది.
ఇప్పుడున్న గ్లామర్ హీరోయిన్ లలోకెల్లా  హైబ్రిడ్ హీరోయిన్ లా కనిపించిన సాయి పల్లవి తో నటించడానికి యువ హీరోలు పోటీపడ్డారు. ఆమె కూడా తెలుగులో యువ హీరోలతో నటిస్తూనే తమిళనాట కూడా మంచి అవకాశాలు అందుకుని అక్కడ హీరోయిన్ స్థిరపడిపోయింది. అయితే ఎన్ని చిత్రాల్లో నటించినా సాయి పల్లవి కి మాత్రం స్టార్ హోదా రావడం లేదు. ఇప్పుడు చూసుకుంటే తెలుగులో ఆమె ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు. ఈనేపథ్యంలో ఎందుకు ఆమె పెద్ద హీరోలు ఛాన్స్ లు ఇవ్వడం లేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఆమెకు పెద్ద హీరోలు ఛాన్స్ లు ఇవ్వకపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయట. పెద్ద హీరోల సిని మాలు అంటే పెద్ద బడ్జెట్ సినిమాలు. ఇందులో హీరోయిన్ లు గ్లామర్ డోస్ ను కాస్త ఎక్కువే చూపించాల్సి ఉంటుంది. కమర్షియాలిటీ దృష్ట్యా మేకర్స్ ఇలా ఆలోచించక తప్పడంలేదు. సాయి పల్లవి గ్లామర్ చూపించే విషయంలో అంత ఎంకరేజింగ్ గా ఉండదు కాబట్టి ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి పెద్ద హీరోలు ఆలోచిస్తున్నారు. ఇకపోతే ఆమె నటన ఇప్పటివరకు ఆమెతోనటించిన హీరోలను డామినేట్ చేసింది. పెద్ద హీరోల విషయంలో కూడా అలా జరుగుతుందేమోనన్న భయంతోనే ఆమెకు ఛాన్స్ లు రావడం లేదన్నది సాయి పల్లవి అభిమానుల ఆలోచన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: