ఆ దర్శకుడి సినిమాతో మలయాళం లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ సమంత గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గానే కొనసాగుతోంది.


దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్ హీరోలతో నటించి ప్రస్తుతం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత తెలుగు తో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది . సమంత  ఫామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్  ద్వారా బాలీవుడ్ లో కూడా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకుంది . అలాగే ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ క్రేజీ ఆఫర్ లను సమంత దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటి వరకు తెలుగు , తమిళ , హిందీ భాషలలో హవా ను చూపిస్తూ వచ్చిన సమంత తాజాగా మలయాళ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది . మలయాళ ఇండస్ట్రీ లో సీనియర్ డైరెక్టర్ అయిన షాజి కైలస్ పింక్ పోలీస్ పేరుతో ఒక మూవీ ని తెరకెక్కి స్తున్నాడు.


ఈ మూవీ ని లేడీ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కించ బోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో సమంత ను నటింపచేయాలనే ఉద్దేశంతో చిత్ర బృందం ఈ ముద్దుగుమ్మ  తో సంప్రదింపులను జరపగా , ఈ సినిమా కథ బాగా నచ్చడంతో సమంత కూడా ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . ఇలా మలయాళ సీనియర్ డైరెక్టర్ షాజి కైలస్ పింక్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ తో సమంత మలయాళ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: