అందాల ముద్దుగుమ్మ నజ్రియా గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజా రాణి' అనే తమిళ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇదే సినిమాతో తెలుగులో కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.
ఇలా తమిళ సినిమాతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు మలయాళ ఇండస్ట్రీలో కూడా ఫుల్ క్రేజ్ వుంది. ఇలా ఇప్పటివరకు మలయాళం, తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం 'అంటే సుందరానికి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ సినిమాలో నాని హీరోగా నటించగా , ఈ మూవీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ 10 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర బృందం లోని సభ్యులు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా కూడా తాజాగా ఓ ఈ సినిమాలో హీరోయిన్ నజ్రియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా నజ్రియా అనేక విషయాలను చెప్పుకొచ్చింది.
తాజా ఇంటర్వ్యూలో నజ్రియా మాట్లాడుతూ... వివేక్ ఆత్రేయ చెప్పిన కథ మరియు అందులో నా క్యారెక్టర్ నాకు నచ్చడం వల్లనే ఈ మూవీ ని చేశాను. మొదటి మూవీ ని నాని కాంబినేషన్ లో చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను అని , వివేక్ ఆత్రేయ నాకు ఏమి అయితే చెప్పాడో దాన్నే తీశాడు. అతని వర్కింగ్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. అతను మళ్లీ ఎప్పుడు డేట్స్ కావాలన్నా ఆలోచించకుండా వెంటనే ఇస్తాను అంటూ ఆయనపై తనకి గల నమ్మకాన్ని నజ్రియా వ్యక్తం చేసింది ఇలా తాజా ఇంటర్వ్యూలో నజ్రియా అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.