సమంత కి అక్కడ పెరుగుతున్న ఛాన్స్ లు..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకుంటూ ప్రేక్షకులను అలరించే విధంగా ముందుకు పోతుంది. విజయ్ దేవరకొండ సరసన ఆమె ఖుషీ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నగా ఈ సినిమాతో పాటు ఆమె ఇప్పటికే తమిళంలో విజయ్ సరసన ఓ సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో అయినా  సరసన నటించడానికి సిద్ధ పడుతూ ఉండడం ఆమె అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది

గతంలో ఆమె బాలీవుడ్ లో ఫ్యామిలీ మెన్ సీరీస్ లో నటించి అక్కడి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న నేపథ్యంలోనే ఆమె ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తే చూడాలని ఉంది అని అక్కడి అభిమానులు డిమాండ్ చేయగా వారి కోరిక మేరకు ఆమె ఈ సినిమా చేస్తుండడం విశేషం. వాస్తవానికి షారుక్ సినిమా జవాన్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించే వలసి ఉంది కానీ అప్పటి పరిస్థితుల కారణంగా ఆమె ఆ సినిమాలో నటించే లేకపోయింది. ఇప్పుడు ఈ హీరో సరసన నటించడం మరింత విశేషం. 

ఇంకొక వైపు వరుస తెలుగు సినిమాలలో ఆమె నటిస్తూనే ఉంది. విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా మాత్రమే కాకుండా ఇతర పెద్ద హీరోలతో కూడా ఆమె కలిసి సినిమా చేసే అవకాశాలు అందుకుంటోంది. ఇంకొకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా ఆమె నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధం చేసిన ఈమె విభిన్న కథాంశంతో కూడిన యశోద అనే మరో సినిమాలో కూడా నటించి విడుదలకు సిద్ధం చేస్తోంది. విడాకుల తర్వాత మళ్ళీ సినిమాలు చేయాలనే ఆకాంక్షతో ప్రయత్నాలు మొదలు పెట్టిన సమంత ఇప్పుడు ఇలా అవకాశాలు రావడం మంచి విశేషం అనే చెప్పలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: