సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . మహేష్ బాబు ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు . ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న మహేష్ బాబు ఇది వరకు ఎన్నో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. అలాగే ఎంతో మంది మాస్ ప్రేక్షకుల అభిమానాన్ని కూడా మహేష్ బాబు సంపాదించుకున్నాడు .
ఇది ఇలా ఉంటే మరో సారి మహేష్ బాబు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో నటించ బోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ అదిరిపోయే యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ అందుకు తగిన అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ కథను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ కథ లో సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాల విషయంలో మహేష్ బాబు , త్రివిక్రమ్ కు కొన్ని మార్పులు చేర్పులను సూచించినట్లు , ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేష్ బాబు సూచించిన సన్నివేశాల మార్పులు... చేర్పుల విషయంలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా లను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే అరవింద సమేత లాంటి అదిరిపోయే మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సారి మహేష్ బాబు హీరోగా హై లెవెల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది . ఈ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది.