కమల్ హాసన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ "ఇండియన్ 2"... ఖరారు అయినట్లేనా?
అయితే ఇంటర్వ్యూ కి హాజరు అయిన కమల్ ను విలేకర్లు పలు ప్రశ్నలు అడిగారు, ఈ క్రమంలో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వివరాలు చెప్పమని అడుగగా కమల్ తన ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చారు. అయితే అందులో ఇండియన్ 2 ఫిల్మ్ గురించి లేకపోవడంతో ఆ సినిమా గురించి చెప్పమని ఒక విలేఖరి అడుగగా.. ఆయన ఇలా ఒకే ప్రాజెక్ట్ పై ఏళ్ల తరబడి టైం వేస్ట్ చేయలేమని అన్నట్లుగా చెప్పడంతో అంతా అవాక్ అయ్యారు. ఇండియన్-2 ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది అని అంతా అనుకుంటున్నారు కానీ అలాంటిది ఏమి లేదు, ఈ సినిమా ఆగిపోయింది అన్న దాంట్లో నిజం లేదు అన్నారు . తప్పకుండా ఆ చిత్రాన్ని మేం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి తీరుతాం.
కరోనా వల్ల మొదట్లో లేట్ ఆ తరవాత, సెట్‌లో యాక్సిడెంట్.. ఇలా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ చిత్రీకరణ కొనసాగించాం. 'ఇండియన్-2' చిత్ర నిర్మాణ సంస్థ లైకా వాళ్లతో మేం ఇప్పటికే పలు చర్చలు జరిపాం. వాళ్లు కూడా సినిమాని త్వరగా పూర్తి చేయాలని ఉద్దేశం తోనే ఉన్నారు. అయితే సమయం కూడా అనుకూలించాలి కదా...వీలయినంత త్వరగా షూట్‌లో పాల్గొని శరవేగంగా పూర్తి చేయాలనే ఉన్నాం అని అన్నారు. ఎందుకంటే ఒకే సినిమా పై పదేళ్లు వర్క్ చేయలేం అది కూడా కష్టమే కదా అన్నట్లుగా అన్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ అనే పేరిట నాకొక సొంత నిర్మాణ సంస్థ ఉంది. అదే విధంగా శంకర్‌కి ఎస్. ప్రొడెక్షన్స్ కూడా, ఈ రెండు సంస్థల్ని మేమే పోషించాల్సి ఉంటుంది. రెండు సంస్థలను నడిపించడం అనేది చిన్న విషయమేమీ కాదు.. దానికోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అందుకోసం మేం బయటకు వెళ్లి పనిచేయాల్సి ఉంటుంది అని కమల్ పేర్కొన్నారు.