ఆహా: సినీ ప్రియుల కోసం..సరికొత్త ఆఫర్.. ఏమిటంటే..?
యూజర్స్ ను మరింత పెంచుకునేందుకు సరికొత్త ప్లాన్ చేస్తోంది ఈ ఓటిటి సమస్త. అదేమిటంటే మూడు నెలల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్గా కేవలం రూ.99 రూపాయలకే అందిస్తున్నది దీంతో ఆహా లోనే సినిమాలు వెబ్ సిరీస్ అన్నిటిని చూడవచ్చు. ఈ ఆఫర్ వ్యాలిడిటీ జూన్ 30 వరకు మాత్రమే ఉంటుంది. ఆహ లో రైటర్, డీజే టిల్లు, క్రాక్, భీమానాయక్ ఇలాంటి చిత్రాలే కాకుండా ఇతర చిత్రాలు సైతం విడుదల కానున్నాయి. తెలుగు ఐడల్ సర్కస్ లతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది ఈ ఆహా సంస్ధ. ఇక ఈ ఆఫర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఈ ఓ టి టి సంస్థ .
ప్రస్తుతం ఉన్న పోటీ ఉన్న ఓ టి టి ఛానల్స్లో లో ఆహానే తక్కువ ధరకు లభిస్తోందని చెప్పవచ్చు. ఇక ప్రతి శుక్రవారం రోజున కూడా సరి కొత్త సినిమాతో ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతోంది ఈ సంస్థ. మరి రాబోయే రోజులలో మరింతగా ప్రేక్షకులను అలరిస్తూ టాప్ పొజిషన్లో ఉంటుందేమో చూడాలి మరి. ప్రస్తుతం తమ యూజర్స్ పెంచుకునేందుకు తమ వంతు కృషి చేస్తూనే ఉంది ఆహా.