టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వి గురించి అందరికీ తెలిసిందే. అగ్రహీరోల సినిమాల్లో నటిస్తూ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ సీనియర్ కమెడియన్. అయితే తాజాగా తన కూతురు సినీరంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.' మా అమ్మాయి శ్రీలు హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి మలేషియా లో సెటిల్ అవ్వాలి అనుకుంది. కానీ డాన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి అన్ని నేర్చుకుంది. నటనపై ఇష్టంతో సినిమాల్లో సన్నివేశాలు చూసి మరీ వాటిని అనుకరించేది. ఇక ఆ తర్వాత మా అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం.
కానీ కుదరలేదు. చివరికి నా స్నేహితుడి కుమారుడు క్రాంతి కుమార్ హీరోగా ముగ్గురు పార్ట్నర్ కలిసి మా అమ్మాయి హీరోయిన్గా సినిమాను నిర్మించామని తెలియ జేశాడు పృథ్వి. ఒక టీం వర్క్ గా ఈ సినిమా కథను రాసుకుని నిర్మించామని.. దాదాపు షూటింగ్ పూర్తి కావాల్సి వచ్చిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని పేర్కొన్నాడు. సీనియర్ రచయిత ఘటికాచలం ఈ సినిమాకి బాగా సహాయం చేశారు. అబ్బాయి అమ్మాయి ప్రతిభను చూశాక నిర్మాతలు కూడా ఎక్కడా తగ్గకుండా ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా ఈ సినిమాను తీశారు. ఇక సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి.
ఈ సినిమాకి సంగీత ఆదిత్య మంచి పాటలు ఇచ్చారు. ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల కాబోతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు కమెడియన్ పృథ్వి. అంతేకాకుండా ఈ సినిమాని తన ప్రతిభతో ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ దర్శకుడు ఈ సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా తీస్తున్నారని, ఆ దర్శకుడి పేరు పూర్తి వివరాలు కూడా త్వరలోనే మీ అందరికీ తెలుపుతామని పృద్వి తెలిపారు...!!