పుష్ప సినిమాతో సంచలన విజయాన్ని అందుకొని ఇప్పుడు పుష్ప రెండవ భాగం యొక్క చిత్రీకరణ పనుల్లో ఉన్న సుకుమార్ యొక్క తదుపరి చిత్రంపై అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. దేశ వ్యాప్తంగా 350 కోట్ల భారీ వసూళ్లను రాబట్టుకున్న పుష్ప సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమా పై భారీ స్థాయిలో ప్రేక్షకులకు అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప2 సినిమాను అంతకుమించి రెడీ చేయాలని భావించి సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం వేరే స్థాయిలో కసరత్తులు చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబదించి ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఆ సినిమా ఉండడం లేదు అని కొంతమంది మధ్యలో ప్రచారం చేసినా కూడా దానికి విజయ్ దేవరకొండ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రంగస్థలం సినిమా నుంచి తన పంథా ను తాను సినిమాలు తెరకెక్కించే విధానాన్ని పూర్తిగా మార్చివేసిన ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ తో ఎలాంటి సినిమా తెరకేక్కిస్తాడా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
పిరియాడిక్ కథల పై కన్నేసిన సుకుమార్ తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి రజాకార్ల కథతో ఈ హీరో తో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టారని అంటున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండ కరెక్ట్ గా సూట్ అవుతారని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా చేస్తే తప్పకుండా ఇద్దరికీ కలిసి వస్తుందని చెబుతున్నారు. మరి ఈ సినిమాను సుకుమార్ ఎలా చేస్తారో అనేది చూడాలి. రాజన్న లాంటి సినిమాలో రజాకార్ల నాటి పరిస్థితులను తెరపైకి తీసుకు రాలేకపోయారు. ఈ సినిమాలో అలాంటి ఫీల్ ను తీసుకురావాలని ఇద్దరు భావిస్తున్నారట. రౌడీ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కు ఈ సినిమా షూట్ అవుతుందా అనేది చూడాలి.