రెండవ రోజు కూడా అదిరిపోయే కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించిన ఎఫ్ 3..!

Pulgam Srinivas
అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా రాజేంద్ర ప్రసాద్,  సునీల్, అలీ ఇతర ప్రధాన పాత్రలలో దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ఎఫ్ 3 సినిమా మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. మొదటి నుండి కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉండడంతో ఎఫ్ 3 మూవీ కి మొదటి రోజు మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు అయ్యాయి. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ కి మొదటి రోజు మంచి టాక్ రావడంతో రెండవ రోజు కూడా ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు నమోదు అయ్యాయి. ఎఫ్ 3  సినిమా రెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.


మొదటి రోజు ఎఫ్ 3 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 9.85 కోట్ల షేర్, 16.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
రెండవ రోజు ఎఫ్ 3 మూవీ
నైజాం : 4.10 కోట్లు .
సీడెడ్ : 1.12 కోట్లు .
యూ ఎ : 1.04 కోట్లు .
ఈస్ట్ : 52 లక్షలు
వెస్ట్ : 28 లక్షలు
గుంటూర్ : 54 లకహాలు
కృష్ణ : 51 లక్షలు
నెల్లూర్ : 24 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 3 మూవీ 2 వ రోజు 8.35 కోట్ల షేర్ ,  13.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.
మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ 3 మూవీ రెండు రోజులకు గాను 23.50 కోట్ల షేర్ , 39.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: