ఆంధ్రుల అభిమాన నటుడు సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే సినిమాల్లో సాధించిన సంచలన విజయాల గురించి, రికార్డుల గురించి ఆయన అభిమానులలో చాలామందికి తెలుసు. ఇకపోతే ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి కాగా లక్ష్మయ్య చౌదరి కొన్న ఇంటిలో సూర్యనారాయణ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి అద్దెకు ఉండేవారు.ఇక ఆ తర్వాత సూర్యనారాయణ బిజినెస్ కోసం ముంబై వెళ్లగా ఆయనను భాగస్వాములు మోసం చేశారు.అయితే ఈ విషయం తెలిసిన లక్ష్మయ్య చౌదరి ఆయనకు సాయం చేయాలని సీనియర్ ఎన్టీఆర్ ను ముంబైకి పంపించారు.
ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ ముంబైలో కోర్టుకు అవసరమైన అన్ని పత్రాలను అందించి సూర్య నారాయణ నిర్దోషిగా విడుదలయ్యేలా చేశారు. అయితే ముంబైలో ఉన్న సమయంలో సీనియర్ ఎన్టీఆర్ మెస్ ను ఏర్పాటు చేశారు.ఇదిలావుంటే తండ్రికి ఇష్టం లేదని తెలిసి ఎన్టీఆర్ ఆ మెస్ ను వదిలేశారు. ఇక ఆ తర్వాత బబ్బూరి వెంకయ్య అనే వ్యక్తితో కలిసి సీనియర్ ఎన్టీఆర్ బిజినెస్ ను మొదలుపెట్టారు.కాగా వెంకయ్య చనిపోవడం వల్ల ఆ వ్యాపారానికి కూడా ఎన్టీఆర్ గుడ్ బై చెప్పారు.అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రింటింగ్ ప్రెస్ నడపగా నష్టాలు రావడంతో ఆ వ్యాపారానికి కూడా ఆయన దూరమయ్యారు.ఇక బీఏ చదువుతున్న సమయంలోనే ఎయిర్ ఆఫీసర్ జాబ్ కు సీనియర్ ఎన్టీఆర్ ఎంపికయ్యారు.
భార్యకు ఇష్టం లేకపోవడంతో సీనియర్ ఎన్టీఆర్ ఆ ఉద్యోగానికి వెళ్లలేదు. అయితే ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ సబ్ రిజిస్ట్రార్ గా చేరారు. అంతేకాదు కేవలం 11 రోజుల పాటు సీనియర్ ఎన్టీఆర్ సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేశారు. ఇకపోతే ఆ తర్వాత సినిమాలలో అవకాశాల కోసం మద్రాస్ రైలెక్కిన సీనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత కెరీర్ విషయంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.అయితే సీనియర్ ఎన్టీఆర్ మరణించి చాలా సంవత్సరాలు అయినా అభిమానుల హృదయాల్లో మాత్రం ఎన్టీఆర్ జీవించి ఉన్నారు.