త్రివిక్రమ్ ప్రెషర్ లో తమన్ ?

Seetha Sailaja
లేటెస్ట్ గా విడుదలైన ‘సర్కారు వారి పాట’ మూవీలో కళావతి పాట మరే పాట మహేష్ అభిమానులకు మాత్రమే కాకుండా సగటు ప్రేక్షకులకు కూడ పెద్దగా నచ్చలేదు. దీనికితోడు ఈమూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడ తమన్ ఫెయిల్ అయ్యాడు అన్న కామెంట్స్ వచ్చాయి. అయితే మహేష్ సపోర్ట్ తమన్ కు పూర్తిగా లభించడంతో ‘సర్కారు వారి పాట’ విషయంలో గట్టేక్కాడు.

అయితే ఇప్పుడు తమన్ కు త్రివిక్రమ్ నుండి విషమ పరీక్ష ఎదురౌతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆగష్టు నుండి మహేష్ తో త్రివిక్రమ్ తీయబోతున్న మూవీకి సంబంధించి జరుగుతున్న పాటల ట్యూనింగ్ సిటింగ్ కార్యక్రమాలలో తమన్ ఇస్తున్న ట్యూన్స్ త్రివిక్రమ్ కు ఏమాత్రం నచ్చడం లేదు అన్న గుసగుసలు ఉన్నాయి. దీనితో తమన్ మరింత ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి తమన్ ఇప్పుడు తెలుగు తమిళ ఫిలిం ఇండస్ట్రీలలో చాల బిజీగా కొనసాగుతున్న మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి పరిస్థితులలో టాప్ హీరోల సినిమాలకు ఇప్పుడు అతడు చిరునామాగా మారుతున్నాడు. ఉదయం నుండి అర్థరాత్రి వరకు పాటల సిటింగ్ కార్యక్రమాలలో రికార్డింగ్ లతో చాల బిజీగా ఉండటంతో గతంలో కొన్ని సినిమాలకు అతడు ఇచ్చిన ట్యూన్స్ ను కొద్దిగా మార్చి మళ్ళీ అవే ట్యూన్స్ ను కొత్త సినిమాలకు ఇస్తున్నాడు అన్న అపవాదు తమన్ పై ఉంది అయితే ఈ అపవాదును తమన్ తీవ్రంగా ఖండించాడు.

‘అల వైకుంఠ పురములో’ మూవీ స్థాయిలో త్రివిక్రమ్ మహేష్ తో తీయబోయే లేటెస్ట్ మూవీలో ట్యూన్స్ ఉండాలని కండిషన్ పెట్టినట్లు టాక్. తమన్ ఆ కండిషన్ ఒప్పుకున్నప్పటికీ మళ్ళీ అలాంటి మాష్టర్ పీస్ ట్యూన్స్ తమన్ నుంచి రావాలి అంటే అతడు తీవ్రమైన మేధోమధనం చేయాలి. అయితే ప్రస్తుతం తమన్ కు ఉన్న బిజీలో అంత మేధోమధనం చేసి త్రివిక్రమ్ కోరిక నెరవేర్చగలడా అన్నదే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: