ఆర్జివి కి తెలంగాణ హైకోర్టులో ఊరట..!!

Divya
వివాదాల డైరెక్టర్ గా పేరు పొందిన రామ్ గోపాల్ వర్మ తాజాగా పోలీస్ కేసు నమోదు కావడం జరిగింది. ఇటీవల దిశా ఎన్ కౌంటర్ సినిమా ఫైనాన్షియల్ శేఖర్ బాబు తన పైన ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.. తనకు రూ. 56 లక్షల రూపాయలు వర్మ ఇవ్వాలని ఆ డబ్బు ఇవ్వమని అడిగితే తనను బెదిరిస్తున్నారని శేఖర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీస్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. తదుపరి చర్యలకు సిద్ధమవుతున్న సమయంలో రాంగోపాల్ వర్మ కు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఊరట నిచ్చే విధంగా ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

కోర్టును ఆశ్రయించిన వర్మ వాదనలు విన్న కోర్టు సంతృప్తి చెంది తెలంగాణ పోలీసులను తదుపరి విచారణ పూర్తయ్యేవరకు ఆర్జీవి ని అరెస్ట్ చేయడం సాధ్యం కాదని తెలియజేసింది. కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వచ్చింది అంటూ వర్మ తన ట్విట్టర్ నుంచి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం కోర్టు కు సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్న కారణంగా ఇతర విషయాల పైన ఎక్కువగా స్పందించలేదు. వర్మ ఇలాంటి కేసులను పిటిషన్లను ఎన్నో చూశారు కనుక ముందు నుండి వర్మ దీని గురించి చాలా ఈజీగా బయట పడతారు అని అందరూ అనుకుంటూ నే ఉన్నారు.
అంతా భావించినట్లు గానే వర్మ చాలా ఈజీగానే ఈ విషయం నుంచి ఊరట దక్కింది.. కోర్టులో వాదనలు పూర్తి అవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నది. అప్పటివరకు శేఖర్ రాజును కేసు విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేరని చెప్పవచ్చు. వర్మ ఈ మధ్య కాలంలో పలు చిత్రాల విషయంలో లావాదేవీల వ్యవహారంలో చిక్కుకుంటూ ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆర్జివి రాబోయే రోజులలో మరింత ఎత్తుకు పోతాడేమో అన్నట్లుగా ఆయన అభిమానులు భయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: