అమెరికాలో ఊపేస్తున్న ఊ అంటావా మావా..వీడియో..

Satvika
తెలుగులో విడుదల అయిన సినిమాలు అమెరికాలో కూడా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ మధ్య విడుదల అవుతున్న అన్నీ సినిమాలు కూడా అమెరికాలో విడుదల అయ్యి భారీ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే.. మొన్నీ మధ్య వచ్చిన అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ ఊపు ఊపెసింది.ఈ సినిమా లొని పాటలు, డైలాగులు అందరి నోటా వినిపించాయి. సామాన్యుల నుంచి సెలెబ్రేటిల వరకూ కూడా అందరినీ ఆకర్షించాయి. సినిమా వచ్చి చాలా రోజులు అయినా కూడా ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదు.


ముఖ్యంగా చెప్పాలంటే సమంత మొదటి సారి నటించిన ఐటమ్ సాంగ్ జనాలను ఓ ఊపు ఊపెసింది.. ఆ పాట మొదట విమర్శలు అందుకున్నా కూడా తర్వాత ఎంత క్రేజ్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల నుంచి వయసు పైబడిన వారు కూడా హమ్ చేసిన పాట అది.. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఇప్పటికీ సందడి చేస్తోంది. తాజాగా యూఎస్‌ లో ఓ 13ఏళ్ల చిన్నారి వయోలిన్‌ వాయిస్తూ ఊ అంటావా, ఊహు అంటావా.. అంటూ కాలిఫోర్నియా వీధుల్లో సందడి చేసింది.


ప్రస్తుతం ఈ వీడయోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుష్పా సినిమా విడుదలై చాలా రోజులే అయినప్పటికీ ఇంకా 'పుష్ప' ఫీవర్ తగ్గడం లేదు. ఇలా పుష్ప సాంగ్ కు క్రేజ్ ఇంకా తగ్గలేదు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది... ఇప్పుడు శ్రీవల్లి పాట ను కూడా వయొలిన్ పై ప్లే చేసింది.. ఆ చిన్నారి ఎంత బాగా ప్లే చేసిందో ఇప్పుడు యూట్యూబ్ లో అంతగా ఫెమస్ అయ్యింది.. పుష్ప 1 బాక్సాఫిస్ ను షేక్ చేసింది.. పార్ట్ 2 ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: