
తెలంగాణ సీఎం ను కలిసిన తమిళ స్టార్ హీరో..
ఇటీవల విజయ్ నటించిన బీస్ట్ సినిమా విడుదల అయ్యింది.ఆ సినిమా పెద్దగా జనాలను ఆకట్టుకోలేక పోయింది. అయిన విజయ్ వెనకడుగు వెయ్యలేదు.. ఇప్పుడు మరో రెండు, మూడు ప్రాజెక్టులలో నటిస్తున్నారు.. షూటింగ్ పని మీద హైదరాబాద్ వచ్చిన విజయ్ తెలంగాణ మంత్రి సీఎం కెసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు.హీరో విజయ్ తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. వీరిని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హీరో విజయ్‌ను సీఎం కేసీఆర్ శాలువాతో సన్మానించారు. విజయ్‌ను కేసీఆర్ అప్యాయంగా పలకరించి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం హీరో విజయ్ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ మూవీకి దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా దర్శకుడు వంశీపైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. సినిమాను తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం హీరో విజయ్ హైదరాబాద్ వచ్చారు.అయితే, హీరో విజయ్ సినిమాలు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలోనూ విడుదలవుతున్నాయి.