
హీరోయిన్ గా ఛాన్సులు రాకపోతే.. ఆ పని చేసుకుంటా?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా అటు నివేదా పేతురాజ్ కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు. ఈ అమ్మడు అందుకునేది అడపాదడపా అవకాశాలు అయినప్పటికీ ఇక ప్రతీ పాత్రలో ఒదిగి పోయిన తీరు మాత్రం ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో ఆకర్షిస్తుందని చెప్పాలి. ఇటీవలి కాలం లో వివిధ పాత్రల్లో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది నివేద పేతురాజ్. ఈ క్రమం లోనే ఇటీవల వరుస అవకాశాలు అందుకుంటోంది.
ఇకపోతే హీరోయిన్గా అవకాశాలు రాకపోతే ఏం చేస్తారూ అన్న విషయం పై స్పందించింది. హీరోయిన్ గా కన్నా నటిగా అనిపించుకోవడం గౌరవం గా ఉంటుందని నివేద పేతురాజ్ చెప్పు కొచ్చింది. ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ హీరోయిన్ గా సినిమాలు చేయకపోతే కెరియర్ ఉండదేమో అని అందరూ అనుకుంటారు. కానీ నా విషయంలో అలా కాదు నేను ఎలాంటి బౌండరీలు పెట్టు కోలేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే చేస్తాను.. ఒకవేళ హీరోయిన్గా అవకాశం రాక పోయినా ఎలాంటి ప్రాబ్లం లేదు. హాయిగా ఉద్యోగం చేసుకుంటాను అంటూ నివేదా పేతురాజ్ చెప్పుకొచ్చింది.