మంచు అభిమానులకు గుడ్ న్యూస్...!!
ఇప్పటి వరకు ఇంతటి డిజాస్టర్ ను చూడలేదు అంటూ సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా అయితే మాట్లాడుకున్నారు. సినిమాలోని ఒక పాట కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశామని మోహన్ బాబు అప్పట్లో చెప్పాడు. అది కూడా సినిమాను కాపాడలేక పోయిందట. పైగా ఆ పాటకు పెట్టిన మొత్తం కూడా సినిమా వసూళ్లు రాబట్టలేక పోయిందట. సినిమాను మంచు విష్ణు నిర్మించిన సంగతి తెల్సిందే. సినిమాను ఎట్టకేలకు మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సినిమా ను థియేటర్ లో చూడాలనుకున్నా కూడా బాగాలేదనే టాక్ వచ్చిన నేపథ్యంలో మంచు వారి అభిమానులు కాస్త ఆగి ఉంటారు.
ఇప్పుడు వారు ఓటీటీ లో చూసేందుకు సిద్దం అయ్యారని తెలుస్తుంది. సినిమా విడుదల అయ్యి చాలా వారాలు అవుతున్నా కూడా ఎందుకు ఓటీటీ లో రావడం లేదు అంటూ మంచు అభిమానులు అనుమానాలు వ్యక్తం చేశారట. కనీసం ఓటీటీ వారు కూడా సన్నాఫ్ ఇండియా సినిమాను చూసేందుకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదా అంటూ కౌంటర్స్ కూడా వచ్చాయి. ఎవరు ఏం అనుకున్నా కూడా మంచు వారు మాత్రం సైలెంట్ గా ఉంటూ వచ్చారు. తాజాగా ఓటీటీ లో సన్నాఫ్ ఇండియా సినిమా వచ్చేసిందట.. మంచు వారి గత చిత్రాల మాదిరిగానే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.. అమెజాన్ లోనే గతంలో మంచు విష్ణు మోసగాళ్లు కూడా స్ట్రీమింగ్ అయ్యిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ సినిమా ను కూడా వారే కొనుగోలు చేయడం జరిగిందట. స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్డేట్ ప్రకటన కూడా లేకుండా అమెజాన్ వారు స్ట్రీమింగ్ చేస్తున్నారట.. ఓటీటీ లో అయినా ఒక మోస్తరుగా జనాలు ఈ సినిమా ను చూస్తారేమో చూడాలి మరి.