
సల్మాన్ ఖాన్ ను నమ్ముకున్న పూజ హెగ్డే !
వీరిద్దరి కాంబినేషన్ లో ఒక ప్రముఖ బూలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ‘కబీ ఈద్ కబీ దివాళీ’ లేటెస్ట్ గా ప్రారంభం అయింది. ఈమూవీ ప్రారంభోత్సవ సందర్భంగా సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే కు డైమన్ పెండెంట్ తో కూడిన ఒక బంగారపు బ్రాస్లేట్ ఇచ్చాడట. దీనికి సంబంధించిన ఫోటోను పూజ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేస్తూ తెగ సంబంర పడిపోయింది. వాస్తవానికి పూజ చాలాకాలం క్రితం హృతిక్ రోషన్ తో కలిసి ‘మొహంజదారో’ మూవీలో నటించి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వాలని చాలరోజుల క్రితమే ప్రయత్నించింది.
అయితే ఆసినిమా భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో పూజ యూటర్న్ తీసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గ్లామర్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ‘అల వైకుంఠపురములో’ మూవీ తరువాత ఆమె మ్యానియా విపరీతంగా పెరిగి పోవడంతో ఆమె 3 కోట్లు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగి పోయింది. అయితే ఆమెను మళ్ళీ బ్యాడ్ లక్ వెంటాడుతూ ఉండటంతో పాటు రష్మిక నుండి ఆమెకు తీవ్రపోటీ ఎదురు కావడంతో పూజ తన రూట్ మార్చి తిరిగి బాలీవుడ్ వైపు చూస్తోంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ పరిస్థితి కూడ ఏమి బాగాలేదు. వరస పరాజయాలతో అతడి మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ జంట కలిసి నటిస్తున్న మూవీ సక్సస్ అయితే పూజ మార్కెట్ బాలీవుడ్ లో బాగా పెరిగి ఆమె పారితోషికం పెరగడంతో పాటు తిరిగి మన టాప్ హీరోలు ఈ బ్యూటీ వైపు చూసే ఆస్కారం ఉంది..