ప్రస్తుతం ప్రేక్షకులు 'ఓ టి టి' లలో మూవీ లను , వెబ్ సిరీస్ లను చూడడానికి బాగా అలవాటు పడిపోయారు. కొంత మంది ప్రేక్షకులు థియేటర్ లకు వెళ్లి సినిమాలు చూడడం కంటే 'ఓ టి టి' లో సినిమాలు చూడ్డానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. అలా ప్రేక్షకులు 'ఓ టి టి' లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ప్రాముఖ్యత ఇస్తూ రావడంతో 'ఓ టి టి' సంస్థలు కూడా ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే కొన్ని సినిమాలు థియేటర్ లలో పెద్దగా ప్రేక్షకులను అలరించకపోయినప్పటికి 'ఓ టి టి' లో మాత్రం ఆ సినిమాలు ప్రేక్షకులు బాగానే ఆలరిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ తమ 'ఓ టి టి' లో ఈ వారం లో టాప్ లీడింగ్ లో అత్యధిక మంది వీక్షించిన సినిమాల మరియు వెబ్ సిరీస్ ల లిస్ట్ ని విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఏమేమి సినిమాలు ఉన్నాయో చూద్దాం.
గంగూభాయ్ కాఠియావాడి : ఆలియా భట్ ప్రధానపాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన గంగూభాయ్ కాఠియావాడి మూవీ ప్రముఖ 'ఓ టి టి' నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన ఈ వారం టాప్ లిస్టులో మొదటి స్థానంలో ఉంది.
ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో
రణ్‌వీర్ సింగ్ '83'మూవీ లు ఉన్నాయి. 83 సినిమా ఇండియా మొదటి సారి ప్రపంచకప్ గెలిచిన 1983 కి సంబంధించి ఉంటుంది. వీటితో పాటు పలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూవీ లు , వెబ్ సిరీస్ లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి.